ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఇమామ్ లు అలాగే మౌజన్లలకు అదిరిపోయే శుభవార్త చెప్పింది చంద్రబాబు నాయుడు కూటమి సర్కార్. ఇమామ్ లు అలాగే మౌజన్ల గౌరవ వేతనం పై కీలక ప్రకటన చేసింది ఏపీ సర్కార్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మసీదుల ఇమాములు అదే సమయంలో మౌజన్లలకు గౌరవ వేతనాన్ని కొనసాగిస్తూ… అధికారిక ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది చంద్రబాబు కూటమి సర్కార్.

ఈ అధికారిక ఉత్తర్వుల ప్రకారం ఇమాములకు నేలకు పదివేల రూపాయల జీతం రానుంది. అలాగే మౌజన్ల లకు నెలకు 5000 రూపాయల చొప్పున ప్రభుత్వ జీతం అందనుంది. ఇక 2024 ఏప్రిల్ నుంచి ఇది వర్తిస్తుందని అధికారిక ఉత్తర్వులు పేర్కొంది కూటమి సర్కారు. వీళ్ళ జీతాల కోసం ప్రత్యేకంగా ఏటా 90 కోట్లు ఇవ్వబోతున్నట్లు ఏపీ మంత్రి ఫారుక్… ప్రకటించారు. ఇక ఏపీ కూటమి సర్కార్ చేసిన ఈ ప్రకటనతో ఇమామ్ లు అలాగే మౌజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.