ఏపీ బడ్జెట్.. ఏ శాఖకు ఎంతంటే..?

-

ఏపీ మొత్తం బడ్జెట్ రూ. 2లక్షల 94 వేల 427.25 కోట్లు కాగా ఇందులో ఏ శాఖకు ఎంత కేటాయించారు అనే విషయాలు ఓ సరి పరిశీలిస్తే.. రెవిన్యూ వ్యయం 2,35,916.99 కోట్లు.. మూలధన వ్యయం 32712.84 కోట్లు.. రెవిన్యూ లోటు 34,742.38 కోట్లు.. ద్రవ్యలోటు 68742.65 కోట్లు.. రెవెన్యూ వ్యయం అంచనా రూ.2.34లక్షల కోట్లు.. ద్రవ్యలోటు రూ.68,743 కోట్లు.. రెవెన్యూ లోటు రూ.34,743 కోట్లు.. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధికి రూ. 16.739 కోట్లు కేటాయించారు.

ఇక జలవనరులకు రూ.16,705 కోట్లు.. ఉన్నత విద్య రూ.2326 కోట్లు.. పట్టణాభివృద్ధి రూ.11490 కోట్లు.. పరిశ్రమలు, వాణిజ్యం రూ.3,127 కోట్లు.. ఇంధన రంగం రూ.8,207 కోట్లు.. పోలీస్ శాఖ రూ. 8495 కోట్లు.. బీసీ సంక్షేమం రూ.3,907 కోట్లు.. మైనారిటీ సంక్షేమం రూ.4,376 కోట్లు.. ఎస్టీ సంక్షేమం రూ.7,557 కోట్లు.. అటవీ పర్యావరణ శాఖ రూ.687 కోట్లు.. గృహ నిర్మాణం రూ. 4,012 కోట్లు.. నైపుణ్యాభివృద్ధి శాఖ రూ.1,215 కోట్లు.. దీపం పథకానికి రూ.895 కోట్లు ఇవ్వగా.. ఈ పథకం ద్వారా 5 లక్షల మందికి లబ్ధి చేకూరనుంది. ఇక వచ్చే మూడేళ్లలో 18 వేల మంది అధ్యాపకులకు శిక్షణాభివృద్ధి కోసం పాఠశాల విద్యాశాఖకు రూ.29,909 కోట్లు కేటాయించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version