అసెంబ్లీ లో వ్యవసాయ బడ్జెట్ ప్రవేశ పెట్టారు మంత్రి అచ్చెన్నాయుడు. అయితే ఈరోజు నుండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. ఈ అసెంబ్లీ సమావేశంలో 2024-25 వార్షిక బడ్జెట్ కీలకం అనేది అందరికి తెలిసిందే. అయితే 2.94 లక్షల కోట్లతో ఏపీ వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టగా.. శాఖల వారీగా కేటాయింపులు జరిపారు. అయితే రూ.43,402 కోట్లతో వ్యవసాయ అభివృద్ధే లక్ష్యంగా ఏపీ వ్యవసాయ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు.
రాష్ట్రానికి వ్యవసాయం వెన్నెముక లాంటిది, 62 శాతం జనాభా వ్యవసాయ అనుబంధ రంగాలపై ఆధారపడిందని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. అయితే గత గత ప్రభుత్వం రైతులకు పంటల బీమా అందించలేదు అని పేర్కొన మంత్రి.. మేము మట్టి నమూనాల కోసం ల్యాబ్‌లు, సాగుకు సూక్ష్మపోషకాలు అందిస్తాం.. విత్తనాలు, ఎరువులు రాయితీపై అందిస్తున్నాం. ఆ విత్తనాల పంపిణీకి 240 కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. ఇక ప్రాథమిక పరపతి సంఘాల ద్వారా ఎరువుల పంపిణీ.. ఉద్యానశాఖకు రూ.3469.47 కోట్లు.. భూసార పరీక్షలకు రూ.38.88 కోట్లు.. వ్యవసాయ మార్కెటింగ్‌కు రూ.314.88 కోట్లు.. పంటల బీమాకు రూ.1023 కోట్లు.. అన్నదాత సుఖీభవకు రూ.4,500 కోట్లు కేటాయించినట్లు అచ్చెన్నాయుడు తెలిపారు.