ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ సమావేశానికి ముహూర్తం ఫిక్స్ అయింది. ఈనెల 21వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ సమావేశం… జరగనుంది. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు అలాగే కార్యదర్శులకు సాధారణ పరిపాలన శాఖ సమాచారం చేరవేసింది.

ఈనెల 19వ తేదీ నాటికి కేబినెట్ సమావేశానికి సంబంధించి ప్రతిపాదనలు పంపించాలని ఆయా శాఖల ఉన్నతాధికారులకు సిఎస్ విజయానంద్ ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ఇక మంత్రివర్గం సమావేశం అనంతరం వెంటనే ఢిల్లీకి ప్రయాణం అవుతారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఈనెల 22వ తేదీన కేంద్ర మంత్రులను సీఎం చంద్రబాబు నాయుడు కలుస్తారు. ప్రధాని నరేంద్ర మోడీ అలాగే అమిత్ షాను కూడా కలిసి ఛాన్సులు ఉన్నాయి.