ఏపీలో త‌గ్గిన క‌రోనా.. ఈ రోజు 94 కేసులు 2 మృతి

ఆంధ్ర ప్ర‌దేశ్ లో క‌రోనా వైర‌స్ కేసులు ఈ రోజు కాస్త త‌గ్గుముఖం పట్టాయి. గ‌డిచిన 24 గంట‌ల‌లో ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రంలో 94 కేసులు మాత్ర‌మే వ‌చ్చాయి. వీటి తో ఇప్ప‌టి వ‌ర‌కు ఆంధ్ర ప్ర‌దేశ్ లో కరోనా కేసుల సంఖ్య 2,90,52,063 కి చేరింది. అలాగే గ‌డిచిన 24 గంట‌ల‌లో ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రంలో క‌రోనా మ‌హ‌మ్మారి బారిన ప‌డి ఇద్ద‌రు మృతి చెందారు. దీంతో ఆంధ్ర ప్ర‌దేశ్ లో ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనా కాటుకు బ‌లి అయిన వారి సంఖ్య 14,488 కి చేరింది.

corona cases | కరోనా కేసులు
corona cases | కరోనా కేసులు

కాగ ఆంధ్ర ప్ర‌దేశ్ లో ప్ర‌స్తుతం 1,279 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అలాగే నేడు ఆంధ్ర ప్ర‌దేశ్ లో 139 మంది కరోనాను జ‌యించారు. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రంలో క‌రోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 20,57,644 కు చేరింది. అలాగే రాష్ట్రంలో గ‌డిచిన 24 గంట‌ల‌లో 29,801 శాంపిల్స్ ను టెస్ట్ చేశారు. దీంతో రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనా టెస్టుల సంఖ్య 3,11,28,369 కి చేరింది. కాగ రాష్ట్రంలో కరోనా కంట్రోల్ లోనే ఉంద‌ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. కానీ ప్ర‌జ‌లంద‌రూ త‌ప్ప‌కుండా క‌రోనా నిబంధ‌న‌ల‌ను పాటించాల‌ని సూచించారు.