సీఎం జగన్‌ కు షాక్‌…వచ్చే నెల 8 నుంచి అంగన్‌వాడీల సమ్మె

-

 

ఏపీ సర్కార్‌ కు బిగ్‌ షాక్‌. డిమాండ్ ల సాధనకు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు డిసెంబర్ 8 నుంచి సమ్మెబాట పట్టనున్నారు. సిఐటియు, ఏఐటియుసి, ఐఎఫ్టియులు కలిసి ఉమ్మడిగా సమ్మెలోకి వెళ్ళనున్నారు. ఇప్పటికే మహిళా శిశు సంక్షేమశాఖ అధికారులకు సమ్మె నోటీసును అందించగా….ఈ నెల 20న జిల్లాల్లో పీడీలు, సిడిపిఓలకు నోటీసు ఇవ్వనున్నారు.

Anganwadis strike from December 8
Anganwadis strike from December 8

23న రౌండ్ టేబుల్ సమావేశాలు, 25 నుంచి 30 వరకు సెక్టార్ సమావేశాలు నిర్వహిస్తారు. సమస్యల్ని పరిష్కరించాలని పలుమార్లు కోరిన ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో సమ్మెకు నిర్ణయించినట్టు అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుబ్బరావమ్మ తెలిపారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ కంటే రూ. 1000 రూపాయలు అదనంగా వేతనం ఇవ్వాలి. సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి గ్రాట్యూటీ విధానాన్ని అంగన్వాడీలకు వర్తింపచేయాలనే డిమాండ్ తో సమ్మెకు దిగుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news