ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. అన్నదాత సుఖీభవ పథకానికి అర్హత సాధించని రైతులకు చంద్రబాబు కూటమి ప్రభుత్వం మరో అవకాశం కల్పించిన సంగతి మనందరికీ తెలిసిందే. మొదటి దశ పరిశీలన అలాగే రెండోదశ ధ్రువీకరణలో అర్హత సాధించలేకపోయిన రైతుల రికార్డులను కంప్లైంట్ మాడీల్ లో పొందుపరిచారు ఏపీ అధికారులు.

అనర్హులుగా ఉన్న రైతులు ఫిర్యాదు చేసేందుకు ముందు రైతు సేవా కేంద్రంలోని సిబ్బందిని కలవాలని.. అధికారులు స్పష్టం చేశారు. ఈనెల 10వ తేదీ లోపు ఫిర్యాదుల స్వీకరణ ముగించాలని.. వ్యవసాయ శాఖ డైరెక్టర్ కీలక సూచనలు చేశారు. ఇది ఇలా ఉండగా మరో 10 రోజుల్లో అన్నదాత సుఖీభవ పథకం నిధులు పడతాయని తెలుస్తోంది. మొన్నటి వరకు ఒకటో తేదీ వరకే డబ్బులు వేస్తానని చెప్పిన ప్రభుత్వం.. ఇంకా వేయలేదు.