మూడు రాజ‌ధానుల‌పై జ‌గ‌న్ మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌య‌మిదే..!

-

రాష్ట్రంలో జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఏర్ప‌డి.. ఏడాది పూర్త‌యింది. ఈ ఏడాదిలో తాము ఎన్నిక‌ల స‌మ‌యంలో ప్ర ‌క‌టించిన మేనిఫెస్టోలోని అంశాల్లో 90 శాతం పూర్తి చేసుకున్నామ‌ని.. జ‌గ‌న్ స్వ‌యంగా ప్ర‌క‌టించారు. ఇక‌, మేనిఫెస్టోలో లేని అంశాల‌ను కూడా దాదాపు చాలా వాటిని పూర్తి చేశామ‌ని కూడా చెప్పుకొచ్చారు. అయితే, జ‌గ‌న్ ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న మూడు రాజ‌ధానుల విష‌యం మాత్రం తొలి ఏడాది పూర్తి చేయాల‌ని భావించినా వివిధ కార‌ణాల‌తో ముందుకు సాగ‌లేదు. నిజానికి ఇది అసెంబ్లీలో చ‌ర్చ‌కు వ‌చ్చే ముందుగానే జ‌గ‌న్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు.

 

చంద్ర‌బాబు హ‌యాంలో రూపుదిద్దుకున్న అమ‌రావ‌తిని పూర్తి చేసేందుకు ప్ర‌భుత్వం వ‌ద్ద నిధులు లేవ‌న్నారు. చంద్ర‌బాబు రియ‌ల్ ఎస్టేట్ మైండ్‌తో దీనిని ప్ర‌తిపాదించార‌ని విమ‌ర్శించారు. ఈ క్ర‌మంలోనే ప‌రిపాల ‌నా రాజ‌ధానిగా అన్ని ఇప్ప‌టికే అమ‌రి ఉన్న విశాఖ అయితే బెట‌ర్ అని ప్ర‌క‌టించారు. ఈ క్ర‌మంలోనే రా జ‌ధానుల అంశం స‌హా రాష్ట్రంలో విస్తృత అభివృద్ధికి ఉన్న అవ‌కాశాల అధ్య‌య‌నంపై జీఎన్‌రావు క‌మిటీ ని వేశారు. ఈ క‌మిటీ నివేదిక మేర‌కు రాష్ట్రంలో మూడు రాజ‌ధానులు ఏర్పాటు చేస్తామ‌న్నారు.

దీనిపై పెద్ద ర‌చ్చే సాగింది. అమ‌రావ‌తిని కొన‌సాగించాలంటూ.. రాజ‌ధాని గ్రామాల్లో రైతులు ఆందోళ‌న చేప‌ట్టారు. అయినా కూడా అసెంబ్లీలో మూడు రాజ‌ధానుల‌పై బిల్లులు తెచ్చిన జ‌గ‌న్ స‌ర్కారు సీఆర్డీఏ ర‌ద్దు ప్ర‌తిపాద‌న‌ను కూడా తెర‌మీదికి తెచ్చారు. అయితే, వీటికి శాస‌న మండ‌లిలో టీడీపీ అడ్డుత‌గ‌‌డంతో ఏకంగా మండ‌లిని ర‌ద్దు చేస్తూ.. తీర్మానం చేశా రు. ఇది ఇంకా పార్ల‌మెంటుకు రావాల్సిన అవ‌స‌రం ఉంది. ఇది తేలితే త‌ప్ప మండ‌లి ర‌ద్దు కాదు. ఇక‌, ఇ ప్ప‌టికే మండ‌లి చైర్మ‌న్ ప్ర‌తిపాదించిన సెల‌క్ట్‌క‌మిటీని వేయ‌క‌పోవ‌డంపై హైకోర్టు ప్ర‌శ్నించింది.

ఇప్పుడు దీనికి ప్ర‌భుత్వం నుంచి స‌మాధానం చెప్పాల్సి ఉంది. మొత్తంగా చూస్తే.. తొలి ఏడాదిలోనూ మూడు రాజ‌ధానుల విష‌యాన్ని తేల్చేసి క‌ర్నూలుకు హైకోర్టు అమ‌రావ‌తిలో అసెంబ్లీ, విశాఖ‌లో పాల‌నా రాజ‌ధాని ఏర్పాటు చేయాల‌న్న జ‌గ‌న్ ప్ర‌తిపాద‌న‌లు ముందుకు సాగ‌లేదు. గ‌డిచిన మూడు మాసాలుగా క‌రోనా లాక్‌డౌన్ కార‌ణంగా కూడా ఈ ప్ర‌క్రియ ముందుకు వెళ్లలేదు. ఈ నేప‌థ్యంలో రెండో ఏడాదిలోకి ప్ర‌వేశించిన జ‌గ‌న్ దీనిని సాధించేందుకు దూకుడు ప్ర‌ద‌ర్శించే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. మ‌రి ఏంచేస్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news