కరోనాతో చనిపోయిన జర్నలిస్ట్ మనోజ్ మృతిపై ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. దారుస్సాలంలోని కార్యాలయంలో ఇవాళ నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ..ఇప్పుడిప్పుడే జీవితంలో ఎదిగి మంచి పేరు తెచ్చుకుంటున్న ఓ యువ జర్నలిస్టు మృతి చెందడం తనను ఎంతగానో బాధపెట్టిందని, తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా వృత్తి ధర్మాన్ని కొనసాగించాడని తెలిపారు. అలాగే జర్నలిస్టులకు ఏదైనా సాయం కావాలంటే తనను సంప్రదించాలని భరోసా ఇచ్చారు.
జర్నలిస్ట్ మనోజ్ మృతిపై స్పందించిన ఒవైసీ..!
-