ఏపీలో మరో ఉద్యోగ నోటిఫికేషన్ – డిగ్రీ లెక్చరర్ పోస్టుల భర్తీకి ప్రకటన

-

 

ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు శుభవార్త. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొన్ని వారాలుగా వరుస నోటిఫికేషన్లు వెలువడుతున్నాయి. ఆయా ప్రభుత్వశాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ల పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే గ్రూప్-2, గ్రూప్-1, పాలిటెక్నిక్, జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి ప్రకటనలు వెలువరించిన ప్రభుత్వం తాజాగా మరో నోటిఫికేషన్ విడుదల చేసింది.

Another Job Notification in AP Advertisement for Degree Lecturer Posts

గవర్నమెంట్ డిగ్రీ కాలేజీల్లో ఖాళీగా ఉన్న లెక్చరర్ పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ శనివారం నోటిఫికేషన్ జారీచేసింది. మొత్తం 11 సబ్జెక్టుల్లో 240 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. సబ్జెక్టుల వారీగా పోస్టుల వివరాలు, విద్యార్హతలు, వేతనం, పరీక్ష విధానం వంటి తదితర వివరాలతో కూడిన పూర్తి సమాచారాన్ని సర్వీస్ కమిషన్ వెబ్సైట్ లో జనవరి 24 నుంచి అందుబాటులో ఉంటుందని పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version