హైదరాబాద్ లో నూతన వసంవత్సర వేడుకలకు పలు ఆంక్షలను విధించారు. ముఖ్యంగా నగరంలో 31న రాత్రి 10 గంటల నుంచి జనవరి 01 ఉదయం గంటల వరకు ఓఆర్ఆర్, ఫ్లై ఓవర్స్, కేబుల్ బ్రిడ్జీ మూసివేయనున్నారు. న్యూ ఇయర్ వేడుకలకు డ్రగ్స్ విక్రయిస్తే జైలుకు వెళ్లడం ఖాయం అని సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి వెల్లడించారు. హైదరాబాద్ నగర వ్యాప్తంగా తనిఖీలు చేపడుతున్నామని వెల్ల డించారు. డ్రగ్స్ సేవించే వారి కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామని తెలిపారు.
మద్యం లిమిట్ కి మించి తాగినా.. డ్రగ్స్ తీసుకున్నా జైలుకు వెళ్లడం ఖాయమని సీపీ స్పష్టం చేశారు. నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు. ఎయిర్ ఫోర్ట్ కి వెళ్లే వాహనదారులు ప్లైట్ టికెట్ చూపించి ప్లై ఓవర్స్ పై వెళ్లవచ్చని సూచించారు. అనుమతి లేకుండా ఈవెంట్స్ నిర్వహించకూడదని సూచించారు. అనుమతి లేకుండా ఎలాంటి కార్యకలాపాలు చేపట్టిన జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు. అర్థరాత్రి ఒంటిగంట దాటాక అన్నీ బంద్. మైనర్లకు అనుమతిస్తే కఠిన చర్యలు తప్పవు అని ఉన్నతాధికారులు హెచ్చరించారు.