Jagan Govt : మరో రూ. 1000 కోట్ల అప్పుకు సిద్ధమైన జగన్ సర్కార్ !

-

Jagan Govt : మరో రూ. 1000 కోట్ల అప్పుకు సిద్ధమైంది జగన్ సర్కార్. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.1,000 కోట్ల అప్పు తీసుకొనుంది. రిజర్వు బ్యాంకు నిర్వహించే సెక్యూరిటీల వేలం లో పాల్గొని…13 ఏళ్ల కాలపరిమితితో తిరిగి చెల్లించేలా ఈ రుణం తీసుకుంటుంది.

CM Jagan will inaugurate the pump house at Lakkasagaram today
CM Jagan will inaugurate the pump house at Lakkasagaram today

దీంతో కలిపి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఓపెన్ మార్కెట్లో తీసుకున్న రుణాలు రూ. 41,500 కోట్లు కానుంది. కార్పొరేషన్ ద్వారా రూ. 20 వేల కోట్ల రుణాలు తీసుకున్నట్లు సమాచారం. ఇది ఇలా ఉండగా, ఇవాళ ఏపీ కేబినెట్ సమావేశం జరుగనుంది. ఇవాళ ఉదయం 11 గంటలకు సీఎం జగన్ అధ్యక్షతన మంత్రి మండలి సమావేశం కానుంది.

ఆంధ్ర ప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలు..రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీలో ప్రవేశ పెట్టనున్న పలు బిల్లులపై ఇవాళ కేబినెట్ లో చర్చించి ఆమోదించే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం అందుతోంది.అలాగే.. వచ్చే అసెంబ్లీ ఎన్నికలు, చంద్రబాబు నాయుడు అరెస్ట్, రైతుల అంశాలు, భారీ వర్షాలు ఇలా చాలా అంశాలపై కేబినెట్ లో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news