ఎడిట్ నోట్: నెక్స్ట్ లోకేష్-రామోజీ..ఆ మీడియా కథలు!

-

రాజకీయాల్లో మీడియా అనేది ఎలాంటి పాత్ర పోషిస్తుందో చెప్పాల్సిన పని లేదు. అయితే న్యూట్రల్ మీడియా అనేది పెద్దగా కనిపించడం లేదు..కానీ ప్రతి పార్టీకి సొంత మీడియా ఉంటుంది…అనుకూల మీడియా ఉంది. ఏపీలో అటు వైసీపీకి, ఇటు టి‌డి‌పికి అనుకూల మీడియా సంస్థలు ఉన్న విషయం తెలిసిందే. ఆ విషయం ప్రతి ఒక్కరికీ తెలుసు. ఇక టి‌డి‌పి మీడియా జగన్‌ని టార్గెట్ చేయడం, అటు వైసీపీ మీడియా చంద్రబాబుని టార్గెట్ చేయడం కామన్.

ఇక చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో ఈ అరెస్ట్ అక్రమం అని, కక్షపూరితమని టి‌డి‌పి మీడియా అంటుంటే..చంద్రబాబు మోసగాడు అని, తప్పు చేశారు కాబట్టే జైలు పాలయ్యారని వైసీపీ మీడియా అంటుంది. ఇలా ఎవరి వర్షన్ వారికి ఉంది. వీటిల్లో వాస్తవాలు ఏంటో ఎవరికి పెద్దగా తెలియడం లేదు. ఇదిలా ఉంటే తాజాగా టి‌డి‌పి అనుకూల మీడియా ఒకటి..బాబుని అరెస్ట్ చేశారు కదా..నెక్స్ట్ లోకేష్, రామోజీ రావుని..అలాగే మైక్ ముందుకొచ్చి వైసీపీని తిట్టే దేవినేని ఉమా, కొలికిపూడి శ్రీనివాసరావుని సైతం అరెస్ట్ చేయాలని చెప్పి జగన్..అధికారులకు ఆదేశాలు జారీ చేశారని ఆ మీడియా కథనాలు ఇచ్చింది.

బాబు అరెస్ట్ సమయంలో లండన్ వెళ్ళిన జగన్..రాగానే అధికారులతో సమావేశమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో జగన్..అధికారులతో మాట్లాడుతూ..నెక్స్ట్ సీట్లు తక్కువ వచ్చిన తానే అధికారంలోకి వస్తానని, అంతా తాను చూసుకుంటానని, లోకేష్, రామోజీని ఎందుకు అరెస్ట్ చేయలేదని, ఈ సారి వదలకూడదు అని ఆదేశాలు ఇచ్చారట.

లోకేష్, రామోజీతో పాటు దేవినేని ఉమా, కొలికిపూడిని లోపల వేయాలని అన్నారట. ఇదంతా టి‌డి‌పి మీడియా ఇచ్చిన కథనం. అంటే జగన్ మీటింగ్ లో ఈ మీడియా ఏదో పక్కన ఉన్నట్లు రాసుకొచ్చింది. అసలు ఇందులో వాస్తవం ఏంటి అనేది తెలియదు. పైగా నమ్మశక్యంగా కూడా లేదు. ఎక్కడైనా తప్పు చేస్తే పోలీసులు అరెస్ట్ చేయడం ఖాయం..అది చట్టప్రకారం జరుగుతుంది. కానీ జగన్ ఏదో కావాలని అరెస్ట్‌లు చేయిస్తున్నారన్నట్లు టి‌డి‌పి మీడియా కొన్ని కథలు రాసుకొచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news