ముచ్చుమర్రి బాలికపై అత్యాచారం, హత్య కేసులో మరో ట్విస్ట్‌ !

-

కర్నూలు ముచ్చుమర్రి బాలిక పై అత్యాచారం, హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ముగ్గురు మైనర్ బాలురను ఇవాళ కర్నూలు జ్యూవెనైల్ కోర్టు లో హాజరు పరచనున్నారు పోలీసులు. ముచ్చుమర్రిలో 7వ తేదీ అదృశ్యమైంది ఆ బాలిక. ఇక బాలిక పై అత్యాచారం, హత్య చేసి కలువలో పడేసామని చెప్పారు మైనర్ బాలురు. దీంతో ముగ్గురు మైనర్లను అదుపులోకి తీసుకొని వారం రోజులుగా విచారించారు పోలీసులు. ఒక వైపు మృతదేహం కోసం గాలింపు, మరోవైపు అనుమానితులను విచారించారు.

Another twist in the rape and murder case of Muchumarri girl

ముచ్చుమర్రి ఎత్తిపోతల అప్రోచ్ కెనాల్ లో, కృష్ణ నదిలో గాలింంచారు. ఇంకా కూడా జాడ తెలియని మృతదేహం. పలు సందర్భాల్లో అనుమానితులను తీసుకువచ్చి ముచ్చుమర్రిలో పలు ప్రాంతాల్లో పరిశీలన చేశారు పోలీసులు. చివరికి ముగ్గురు మైనర్ బాలురపై అత్యాచారం, హత్య కేసు నమోదు చేశారు పోలీసులు. వారి తండ్రులపైనా కేసు నమోదు నమోదు చేశారు. ఇక నిందితులను ఇవాళ కోర్టులో హాజరుపరచనున్నారు పోలీసులు. మరి కోర్టు.. దీనిపై ఎలాంటి తీర్పు ఇస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version