ట్రంప్‌ను నేను అలా అనాల్సింది కాదు.. అది నా తప్పే : జో బైడెన్‌

-

అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ అభ్యర్థులు బైడెన్‌, ట్రంప్‌ ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు గుప్పించుకుంటున్నారు. ఈ క్రమంలో బైడెన్‌ ఓ సందర్భంలో మాట్లాడుతూ.. ఇక నుంచి ట్రంప్‌పై దృష్టి సారించాల్సిన అవసరం ఉందంటూ ఆయణ్ను టార్గెట్ చేయాలనే అర్థం వచ్చేలా వ్యాఖ్యానించారు. ఈ విమర్శలే ట్రంప్‌పై కాల్పులకు ఈ మాటలే ఉసిగొల్పాయంటూ పలువురు ఆరోపించడంతో దీనిపై తాజాగా బైడెన్ స్పందించారు.

ట్రంప్‌ను లక్ష్యంగా చేసుకోవాలంటూ తాను చేసిన వ్యాఖ్యలు పొరపాటేనని.. తాను అలా అనాల్సింది కాదని బైడెన్ అన్నారు.  అయితే ట్రంప్‌పై దాడి చేయాలనడం తన ఉద్దేశం కాదని స్పష్టం చేశారు. తనను ట్రంప్‌ అంతకంటే తీవ్రమైన పదజాలంతో విమర్శించారని..  ‘బైడెన్‌ గెలిస్తే రక్తపాతమే’ అంటూ ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా అధ్యక్షుడు ప్రస్తావించారు. ట్రంప్‌ ఇప్పటికీ ప్రజాస్వామ్య వ్యవస్థకు ముప్పేనని పేర్కొన్నారు.

ట్రంప్‌తో డిబేట్  తర్వాత బైడెన్‌పై సొంత పార్టీవారే విమర్శలు చేసిన విషయం తెలిసిందే. దీంతో పార్టీ నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. తనపై విమర్శలు ఇక ఆపాలని పిలుపునిచ్చారు. ట్రంప్‌పైకి దృష్టి మళ్లించాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version