ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 11 నుంచి ప్రారంభం కానున్నాయి. అదే రోజు ఉదయం 10 గంటలకు రాష్ట్ర ప్రభుత్వం వార్షిక బడ్జెట్ ను సభలో ప్రవేశపెట్టనుంది. ఇప్పటివరకూ ఉన్న ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఈ నెలాఖరుతో ముగియనుంది. ఈ నేపథ్యంలో పూర్తిస్థాయి బడ్జెట్ ను ప్రవేశ పెట్టనున్నారు. కనీసం పదిరోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. బడ్జెట్ తో పాటు ఇతర బిల్లులను కూడా సభ ముందుకు తీసుకురానుంది.
అయితే ఈ బడ్జెట్ సమావేశాలు దాదాపు 10 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది. పలు బిల్లులను కూడా సభలో ప్రవేశ పెట్టనుంది. నవంబర్ నుంచి మార్చి వరకు పూర్తి స్థాయిలో బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం.