ఏపీ మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో జరుగుతున్న కేబినెట్ భేటీలో పలు కీలక అంశాలపై చర్చిస్తున్నారు. ఈ చర్చల్లో భాగంగా.. స్థానిక సంస్థలు, సహకారం సంఘాల ఎన్నికల్లో ముగ్గురు పిల్లలు ఉంటే పోటీకి అనర్హులు అనే నిబంధనను రద్దు చేసే అవకాశముంది. దీనిపై భేటీలో చర్చిస్తున్నారు. మరోవైపు జగన్ హయాంలో ఎక్సైజ్ శాఖలో జరిగిన అవకతవకలు, మత్స్యకారులకు నష్టం చేకూర్చేలా గతంలో తీసుకొచ్చిన 217 జీవో రద్దుపై చర్చ కొనసాగుతోంది. ఇక మావోయిస్టులపై నిషేధం పొడిగిస్తూ కేబినెట్‌లో తీర్మానం చేసే అవకాశముంది. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ర్యాటిఫికేషన్ సహా వాలంటీర్ల వ్యవస్థ, రాష్ట్రవ్యాప్తంగా భూ అక్రమాలపై వస్తున్న ఫిర్యాదులు చేపట్టాల్సిన చర్యలపైనా చర్చిస్తారు.
ఇక కేబినెట్ భేటీ అనంతరం సీఎం చంద్రబాబు మధ్యాహ్నం 3 గంటలకు చీరాలకు వెళ్లాల్సి ఉండగా.. ఎడతెరిపి లేని వర్షం కారణంగా ఆ పర్యటనను సీఎం రద్దు చేసుకున్నారు. విజయవాడలో నిర్వహించే చేనేత దినోత్సవంలో చంద్రబాబు పాల్గొననున్నారు.