AP : ఈ నెల 11న కేబినెట్ సమావేశం జరుగనుంది. ఈ నెల 11న సీఎం జగన్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. వెలగపూడి సచివాలయంలోని మొదటి బ్లాక్ లో సమావేశం నిర్వహిస్తామని సిఎస్ జవహర్ రెడ్డి తెలిపారు.
కేబినెట్ లో చర్చించాల్సిన ప్రతిపాదనలను ఈ నెల 8వ తేదీ మధ్యాహ్నం 12 గంటల్లోగా పంపాలని అన్ని శాఖలను సిఎస్ ఆదేశించారు. విశాఖ నుంచి పరిపాలన, నవరత్నాల పథకాల అమలుకు ఆమోదం సహా పలు అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.
ఇది ఇలా ఉండగా.. తుఫాను పరిస్థితులపై ఇవాళ సీఎం జగన్ సమీక్ష నిర్వహించనున్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సమావేశం జరుగనుంది. తుఫాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో వర్చువల్‌గా పరిస్థితిని సమీక్షించస్తున్న సీఎం జగన్.. తీసుకోవాల్సిన సహాయ, పునరావాస చర్యలు, ముందు జాగ్రత్తలపై అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. ఈ సమావేశానికి హోంమంత్రి తానేటి వనిత, ఇతర ఉన్నతాధికారులు వచ్చారు.