Telangana : ఇవాళ సాయంత్రం సీఎం ప్రమాణ స్వీకారం!

-

ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజ్ భవన్ లో సీఎం ప్రమాణ స్వీకారానికి అధికారులు ఏర్పాట్లుచేస్తున్నారు. టెంట్లు, కుర్చీలను ఇప్పటికే రాజ్ భవన్ కు తరలించారు.

Revanth Reddy will vote in Kodangal

ప్రస్తుతం సీఎల్పీ సమావేశం జరుగుతుండటంతో కాసేపట్లో ముఖ్యమంత్రి అభ్యర్థిపై క్లారిటీ రానుంది. సీఎంతో పాటు మరికొంతమంది మంత్రులు కూడా నేడు సాయంత్రం ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

కాగా, కాంగ్రెస్ ని గెలిపించడంలో ప్రధాన పాత్ర పోషించిన పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ముఖ్యమాంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు సిద్ధమవుతున్నట్లు కాంగ్రెస్ హై కమాండ్ నుంచి అందిన సమాచారం.ఈరోజు ఈ అంశంపై అధిష్టానం అసలు నిర్ణయాన్ని వెలువడించనుంది. కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్ హైద్రాబాద్ లో మకాం వేసి పరిస్థితులను సమీక్షిస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news