11 వేల కోట్లతో ఏపీలో తొలిదశలో మెట్రోరైల్ ప్రాజెక్టు..!

-

రాజధాని అమరావతికి గతంలో ఇచ్చిన నిర్మాణ పనుల టెండర్ల రద్దు పై క్యాబినెట్ లో చర్చ జరిపారు. ఆయా పనులకు కొత్తగా టెండర్లు పిలిచే అంశంపై చర్చించి ఆమోదముద్ర వేయనుంది మంత్రివర్గం. ఇక రాష్ట్రవ్యాప్తంగా భవన నిర్మాణ అనుమతులను అర్బన్ డెవలప్మెంట్ అథారిటీల నుంచి తొలగించేలా చట్ట సవరణకు పై కూడా చర్చించారు. ఇక నుంచి భవన నిర్మాణ అనుమతుల్ని ఆయా మున్సిపాలిటీలు, కార్పోరేషన్లే ఇచ్చేలా ఏపీ మెట్రో రీజియన్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చట్ట సవరణ చేయనుంది.

అలాగే రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీలు, కార్పోరేషన్ చైర్మన్ల పై అవిశ్వాస తీర్మానానికి ఉన్న గడువు తగ్గించే అంశంపై.. నాలుగేళ్లుగా ఉన్న గడువును రెండున్నరేళ్లకు కుదించేలా చర్చ జరిగింది. ఇక విశాఖ, విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టులపై చర్చించిన కేబినెట్.. ఈ ప్రాజెక్టులను వందశాతం కేంద్రమే భరించేలా కేబినెట్ లో తీర్మానం చేయాలని ప్రతిపాదన తెచ్చారు. విశాఖలో మూడు కారిడార్ లు, విజయవాడలో రెండు కారిడార్లలో మెట్రో రైల్ నిర్మాణానికి ప్రతిపాదన పెట్టాలని.. తొలిదశలో రూ.11 వేల కోట్ల వ్యయంతో మెట్రోరైల్ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టేలా ప్రతిపాదనలు తీసుకువచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news