ఇవాళ ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ భేటీ కానుంది. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఉదయం 11 గంటలకు మంత్రి వర్గ సమావేశం జరుగనుంది. అమరావతి రీస్టార్ట్ కార్యక్రమానికి వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీకి క్యాబినెట్ ప్రత్యేక ధన్యవాదాలు తెలపనుంది. 47వ సీఆర్డీఏ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై మంత్రి వర్గం ఆమోదం తెలపనుంది. పలు సంస్థలకు భూ కేటాయింపులపై ఆమోదించే అవకాశాలున్నాయి.
ఇక తల్లికి వందనం, అన్నదాత వంటి తదితర సంక్షేమ కార్యక్రమాల పై ఇవాళ జరిగే క్యాబినెట్ భేటీలో చర్చ జరుగనున్నట్టు సమాచారం. భారత ప్రధాని నరేంద్ర మోడీ సభ విజయవంతం పై సీఎం చంద్రబాబు నాయుడు మంత్రులతో డిస్కస్ చేయనున్నారు. అలాగే భారత్ – పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు, దేశవ సరిహద్దులో యుద్ధ వాతావరణం పై కూడా మంత్రులతో సీఎం చంద్రబాబు చర్చించే అవకాశం ఉంది. క్యాబినెట్ లో తీర ప్రాంత భద్రత పై ప్రత్యేక చర్చ జరుగనుంది.