భారత్-పాక్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఇరు దేశాలకు తాను ఏవిధంగానైనా సహాయం చేయగలిగితే తప్పకుండా సహాయం చేస్తానని పేర్కొన్నారు. రెండు దేశాల మధ్య పెరుగుతున్న సంఘర్షణను ఆపాలని కోరుకుంటున్నాని తెలిపారు. భారత్ – పాక్ మధ్య యుద్ధం గురించి ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు సమాధానంగా ట్రంప్ అది భయంకరమైంది అని పేర్కొన్నారు. రెండు దేశాలతో కలిసి పని చేయాలనుకుంటున్నానని స్పష్టం చేశారు ట్రంప్.
భారత్-పాక్ రెండు తనకు బాగా తెలుసు అని.. వారు ఉద్రిక్తతకు ముగింపు పలకాలని కోరుకుంటున్నానని తెలిపారు. వాళ్లు ఆపాలని.. ఇప్పుడు ఆపగలరని ఆశిస్తున్నట్టు వివరించారు. ఒకరిపై ఒకరు పోటీ పడుతున్నారు. రెండు దేశాలతో మంచి సంబంధం ఉందని.. ఈ ఉద్రిక్తతలు ఆగిపోవాలని కోరుకుంటున్నట్టు వెల్లడించారు. ఈ శత్రుత్వం అతి త్వరలోనే ముగిసిపోతుందని ఆశిస్తున్నట్టు చెప్పారురు. రెండు దేశాల మధ్య ఉన్నటువంటి విభేదాలను పరిస్కరించడానికి తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు.