ఏపీ మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు..!

-

ఏపీ మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో 85వేల కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఎస్ఐపీబీ నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అలాగే నేరాలను నియంత్రించేందుకు పీడీ యాక్ట్ పటిష్టం చేస్తూ సవరణ బిల్లుకు.. లోకాయుక్త చట్ట సవరణ బిల్లు కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇక లోకాయుక్త నియామకంలో ప్రతిపక్ష నేత లేనప్పుడు ఏం చేయాలనేదానిపై చర్చించారు. పార్లమెంట్ లో అనుసరించిన విధానం కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు.

ఇక దేవాలయ కమిటీల్లో ఇద్దరు సభ్యులకు చోటు కల్పించేలా చట్టసవరణ బిల్లుకు ఆమోదం ఇచ్చిన మంత్రివర్గం.. కర్నూల్ లో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు.. ఈగల్ పేరు తో యాంటీ నార్కోటిక్స్ విభాగం ఏర్పాటుకు.. కాంట్రాక్టర్లకు మొబలైజేషన్ అడ్వాన్స్ లు పునరుద్ధరించేందుకు.. ఏపీ టవర్ కార్పొరేషన్ ను ఫైబర్ గ్రిడ్ లో విలీనం చేసేందుకు నిర్ణయం తీసుకున్నది. అదే విధంగా అమరావతి సాంకేతిక కమిటీ ఇచ్చిన ప్రతిపాదనలకు ఆమోదం తెలిపిన మంత్రి వర్గం.. స్పోర్ట్స్ పాలసీ, పర్యాటక పాలసీలకు ఆమోదం తెలిపింది. ఇక కొత్తగా టెండర్లు పిలిచి అమరావతి నిర్మాణ పనులు కొంసాగించేలా సాంకేతిక కమిటీ ప్రతిపాదనలు ఇచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news