BIG BREAKING : ‘చంద్రబాబుకు పదేళ్లు జైలు శిక్ష పడొచ్చు’

-

స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో దాదాపు రూ. 550 కోట్ల వరకూ అవినీతి జరిగిందని సిఐడి చీఫ్ సంజయ్ వెల్లడించారు. చంద్రబాబుకు అన్ని విషయాలు తెలిసే జరిగాయని… ఈ కేసులో ఆయనపై ఆరోపణలు నిరూపితం అయితే పదేళ్ల వరకు జైలు శిక్ష పడవచ్చని తెలిపారు. ఈ స్కామ్ లో చంద్రబాబు పాత్ర గురించి మరిన్ని వివరాలు రాబట్టేందుకు ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు.

AP CID Chief Sanjay
AP CID Chief Sanjay

ఇంటర్ పోల్ సహాయం తీసుకుంటామని.. మిగిలిన విచారణ సంస్థల సహాయం కూడా తీసుకుంటామని పేర్కొన్నారు. జ్యుడీషియల్ రిమాండ్ ను అడుగుతామని.. 370 కోట్లలో 270 కోట్లు దారి మళ్ళాయని పేర్కొన్నారు. 100 కోట్ల రూపాయలతో నైపుణ్య సెంటర్లను ఏర్పాటు చేశారు.. విదేశాలకు తప్పించుకున్న వారిని తీసుకుని వచ్చి విచారిస్తే మరిన్ని విషయాలు బయటకు వస్తాయని చెప్పారు సిఐడి చీఫ్ సంజయ్.

Read more RELATED
Recommended to you

Latest news