బర్డ్ ఫ్లూపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

-

ఆంధ్రప్రదేశ్ లో బర్డ్ ప్లూ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా రాష్ట్రంలో బర్డ్ ప్లూ తో తొలి మరణం చోటు చేసుకోవడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మహమ్మారి వ్యాప్తిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. బర్డ్ ఫ్లూపై ఎవరికీ ఆందోళన అవసరం లేదని అన్నారు. బాలిక మృతి ఘటనపై ఐసీఎంఆర్ అధ్యయనం చేసిందని తెలిపారు.  ఆ బృందంతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ వ్యాధి సోకడానికి.. వ్యాధినిరోధక శక్తి లేమి, అపరిశుభ్ర పరిసరాలు, లెప్టొస్పిరోసిస్ కారణమని నిర్ధారించినట్లు తెలిపారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని.. అలా అని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ధైర్యం చెప్పారు. మరోవపైు బర్డ్ ఫ్లూతో ఏపీలో తొలి మరణం పై కేంద్రం ఫోకస్ చేసింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని అలర్ట్ చేసి  ఢిల్లీ ఎన్సీబీకి చెందిన ముగ్గురు సభ్యులతో పాటు ముంబయికి చెందిన మరో డాక్టర్ మంగళగిరి ఎయిమ్స్ డాక్టర్ తో కలిపి ఒక బృందం ఏర్పాటు చేసింది. ఈ బృందం మొదట ఎయిమ్స్ ఉన్నతాధికారులతో సమావేశమై ఈ మరణంపై అధ్యయనం చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news