తెలంగాణ ప్రజాప్రతినిధులకు టీటీడీ సిఫార్సు లేఖల కోసం ప్రత్యేక పోర్టల్

-

తెలంగాణ ప్రజాప్రతినిధులు ఇకపై టీటీడీకి ఇచ్చే సిఫార్సు లేఖలను.. ఇందుకోసం ప్రత్యేకంగా రూపొందించిన పోర్టల్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు, ప్రజాప్రతినిధులు భక్తులకు ఇచ్చే వీఐపీ బ్రేక్ దర్శనం, రూ.300 ప్రత్యేక దర్శన టిక్కెట్లకు సంబంధించిన లేఖలన్నీ ఈ పోర్టల్ ద్వారానే సమర్పించాలి. ఈ విషయాన్ని టీటీడీ అధికారులు అధికారికంగా ప్రకటించారు. భక్తుల సౌకర్యార్థం తెలంగాణ ప్రభుత్వం ఈ పోర్టల్‌ను ప్రజాప్రతినిధులకు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు.

ప్రజాప్రతినిధులు సిఫార్సు లేఖలపై సంతకం చేసిన తర్వాత స్కాన్ చేసి ఈ పోర్టల్ లో అప్లోడ్ చేయాలి. అనంతరం భక్తులకు అసలు లేఖను అందజేయాలి. ఈ విధానం ద్వారా ప్రజాప్రతినిధులు ఇచ్చే లేఖలకు ఓ సమర్థమైన విధానం నెలకొంటుంది. అని టీటీడీ భావిస్తోంది. ఈ పోర్టల్‌లో నమోదైన లేఖల వివరాల ప్రకారమే టీటీడీ భక్తులకు దర్శన అనుమతులను మంజూరు చేస్తుంది. పోర్టల్‌లో అప్లోడ్ కాని లేఖలను టీటీడీ అనుమతించదని అధికారులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news