గుడ్ ఫ్రై డే సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు సందేశం..

-

గుడ్ ఫ్రై డే సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు సందేశం పంపారు. శరీరంలోకి మేకులు దించిన సమయంలో కూడా ఆ దేవదూత శాంతినే ప్రబోధించాడన్నారు. అందుకే ఆయన చూపిన మార్గం అనుసరణీయం అని పేర్కొన్నారు. క్రీస్తు త్యాగాన్ని స్మరించుకుంటూ, ఆయన బోధనలు పాటిస్తూ సర్వమానవ సమానత్వాన్ని, శాంతిని నెలకొల్పేందుకు కృషి చేద్దామని ప్రకటించారు ఏపీ సీఎం చంద్రబాబు.

AP CM Chandrababu Naidu’s message on the occasion of Good Friday

ఇక అటు సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. గుడ్ ఫ్రైడే సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి సందేశం ఇచ్చారు. యేసు క్రీస్తు త్యాగాన్ని, ధైర్యాన్ని గుర్తు చేసుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. యేసు ప్రభు ప్రేమ, కృప కటాక్షాలు ఎప్పుడూ ప్రజలపై ఉండాలని కోరారు సీఎం రేవంత్ రెడ్డి.

శాంతి, కరుణ సందేశాలతో పాటు క్రీస్తు నేర్పిన సేవ, దయ, సోదరభావం ఇప్పటికీ ఎప్పటికీ మానవాళికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని చెప్పారు. క్రీస్తు త్యాగాల జ్ఞాపకంగా జరుపుకునే గుడ్ ఫ్రైడే వేడుకలను క్రైస్తవ సోదర సోదరీమణులందరూ ఘనంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు సీఎం రేవంత్ రెడ్డి.

 

Read more RELATED
Recommended to you

Latest news