తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలెర్ట్. నేడు తెలంగాణలో 16 జిల్లాలకు వర్ష సూచన ఉన్నట్లు పేర్కొంది వాతావరణ శాఖ. తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడనున్నట్లు పేర్కొంది. కొన్ని చోట్ల వడగళ్ల వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 30-40 కి.మీ.వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది.

కాగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నేడు పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, శ్రీసత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, తూర్పు గోదావరి, శ్రీకాకుళం, అల్లూరి, మన్యం జిల్లాల్లో వర్షాలు కురవనున్నట్లు పేర్కొంది. మరోవైపు అల్లూరి జిల్లా కూనవరం, చింతూరు మండలాల్లో తీవ్రమైన వడగాలులు వీచే ప్రభావం ఉందని వెల్లడించింది.