దావోస్ పర్యటన వివరాలను వెల్లడించారు ఏపీ సీఎం చంద్రబాబు. ఈ సందర్భంగానే…విజయసాయి రెడ్డి రాజీనామాపై స్పందించారు ఏపీ సీఎం చంద్రబాబు. నమ్మకం ఉంటే ఉంటారు లేకపోతే వెళ్ళిపోతారంటూ చురకలు అంటించారు. పార్టీ పరిస్థితి కూడా ముఖ్యం… ఇది వాళ్ళ ఇంటర్నల్ వ్యవహారం అన్నారు చంద్రబాబు నాయుడు. ఇక అటు దావోస్ పర్యటన వివరాలను వెల్లడించారు ఏపీ సీఎం చంద్రబాబు.
ప్రపంచ భవిష్యత్తు అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, గ్రీన్ ఎనర్జీదే అన్నారు. పెట్టుబడిదారులను ప్రోత్సహించే విధంగా ఏపీ, తెలంగాణ, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రులు కలిసి దేశ వ్యూహాత్మక చర్చలు జరిపామని తెలిపారు.
రాజకీయాల్లో ఉన్నా లేకపోయినా, తప్పు చేసిన వాడు శిక్ష అనుభవించాల్సిందే అంటూ ఏపీ హోం మంత్రి అనిత రియాక్ట్ అయ్యారు. విజయసాయిరెడ్డి కి కలలో కి గొడ్డలి వచ్చిందేమో, అందుకే భయపడి రాజీనామా చేసి వుండొచ్చు అన్నారు.