ఆంధ్ర ప్రదేశ్ రోడ్ల పరిస్థితులపై సీఎం చంద్రబాబు ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగానే.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని రోడ్ల పరిస్థితులపై సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు నాయుడు….ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని రోడ్ల నిర్మాణం, ఇతర పరిస్థితులపై ఆరా తీశారు. గత ప్రభుత్వ హయాంలో కనీసం గుంతలు కూడా పూడ్చలేదని ఈ సందర్భంగా అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు. కాంట్రాక్టర్లకు బిల్లులు కూడా చెల్లించకపోవడంతో…. పనులు చేయడానికి ఇప్పుడు ఎవరు ముందుకు రావడంలేదని వెల్లడించారు. ప్రస్తుతం 4,151 కిలోమీటర్ల మేర రోడ్లపై గుంతల సమస్యలు ఉన్నాయని చెప్పారు.
తక్షణమే మరమ్మతులు చేయాల్సిన రోడ్లు 2,936 కిలోమీటర్ల మేర ఉన్నాయని…. మొత్తంగా 787 కిలోమీటర్ల పరిధిలో పనులు చేపట్టాలని అధికారులు వివరించారు. గుంతలు పూడ్చేందుకు తక్షణమే 300 కోట్లు అవసరమని సీఎం దృష్టికి తీసుకువచ్చారు. దీంతో వెంటనే టెండర్లను పిలిచి ఆ పనులు చేపట్టాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులకు ఆదేశించారు. రాష్ట్రంలో మొత్తం 53 వేల కిలోమీటర్ల రోడ్లు ఉండగా… వాటిలో 8 వేల కిలోమీటర్లు జాతీయ రహదారులు ఉన్నాయి. ఇక 12,450 కిలోమీటర్లు రాష్ట్ర రహదారులు కాగా….. జిల్లా రహదారులు, చిన్న రోడ్లు కలిపే మరో 32,750 కిలోమీటర్లు ఉన్నాయి. వీటికి మరమ్మతలకు ఎంత వ్యయం అవుతుందో నివేదిక తయారు చేయాలని సీఎం చంద్రబాబు చెప్పారు.