ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆస్పత్రి పాలయ్యాడు. హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేరారు. జ్వరం, వెన్నునొప్పితో బాధపడుతున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు స్కానింగ్, ఇతర వైద్య పరీక్షలు చేశారు. రిపోర్ట్స్ పరిశీలించి మరికొన్ని టెస్టులు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు అవసరం ఉంటుందన్నారు వైద్యులు.

ఈ తరుణంలోనే రేపటి నుంచి ప్రారంభమయ్యే ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు పవన్ కళ్యాణ్ హాజరవుతారని ప్రకటన చేశారు. మార్చి మొదటి వారంలో మిగిలిన వైద్య పరీక్షలు చేయించుకుంటారని వెల్లడించారు.