AP : నేటి నుంచి EAPCET తుది విడత కౌన్సెలింగ్

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యార్థులకు బిగ్ అలర్ట్. ఆంధ్రప్రదేశ్ Eapcet 2023 బైపిసి స్ట్రీమ్ తుది విడత కౌన్సెలింగ్ ఇవాల్టి నుంచి ప్రారంభం కానుంది. మొదటి విడత కౌన్సిలింగ్ కు హాజరుకాని విద్యార్థులు ఇవాళ మరియు రేపు జరిగే కౌన్సిలింగ్ కు హాజరు కావాలని అధికారులు ప్రకటించారు.

AP EAMCET 2023 Counselling

ఇక సర్టిఫికెట్ వెరిఫికేషన్ అనంతరం ఈ నెల 22వ తేదీ, 23వ తేదీ అలాగే 24వ తేదీలలో వెబ్ ఆప్షన్ ల నమోదు ప్రక్రియకు అవకాశం ఇస్తామని తెలిపారు. అంతేకాకుండా ఈనెల 25వ తేదీన వెబ్ ఆప్షన్ల సవరణ కూడా ఉంటుంది. అటు 27వ తేదీన సీట్ల కేటాయింపు చేయనున్నారు అధికారులు.

ఇక ఈ నెల 28వ, 29 మరియు 30వ తేదీలలో కాలేజీలలో రిపోర్టింగ్ ఉంటుందని ప్రకటించారు అధికారులు. ఈ తేదీలను గుర్తు పెట్టుకోవాలని… ప్రతి ఒక్క విద్యార్థి మిస్ కాకుండా చూసుకోవాలని అధికారులు సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news