తెలంగాణ శాసనసభ సమయం కీలక ఘట్టానికి చేరుకుంది. ఎన్నికల పోలింగ్‌కు సమయం సమీపిస్తున్నందున అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. అయితే పోలింగ్ ఏర్పాట్లను పర్యవేక్షించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈ నెల 30వ తేదీన జరగనున్న పోలింగ్ ఏర్పాట్ల తీరుతెన్నులపై కేంద్ర ఎన్నికల సంఘం ఇవాళ దిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించనుంది.
రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, ఎన్నికల సంఘం అధికారులతో సమగ్ర సమీక్ష నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణ ముఖ్య ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌కు సమాచారం తెలిపింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన వారిపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లపైయ. ఓటరు సమాచార పత్రాలు, ఓటరు కార్డుల పంపిణీ స్థితిగతులు, పోస్టల్ బ్యాలెట్ పత్రాల ముద్రణ తదితర అంశాలపైన ఈ సమావేశంలో ఎన్నికల సంఘం సమీక్షించనుంది.
మరోవైపు ఇంటి నుంచి ఓటింగ్ నమోదు ప్రక్రియ మరింత వేగం పెరగాలంటూ కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఓటరు సమాచార పత్రాల పంపిణీ 1-2 రోజుల్లో పూర్తి చేయాలని సూచించింది.