AP Ex CM YS Jagan Poru Bata On AP Govt: వైసీపీ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా పోరుబాటకు సిద్ధమైనట్టుగా ప్రకటించారు. ఏపీలో మద్దతు ధరలు లేకపోవడం వల్ల రైతులు అల్లాడిపోతున్నారు. వారికి అండగా ఈ రోజు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా పోరుబాటకు సిద్ధమైనట్టుగా వైసీపీ పార్టీ అనౌన్స్ చేసింది.
రైతులతో కలిసి తమ నాయకులు కలెక్టరేట్లకు ర్యాలీగా తరలి వెళ్లి వినతి పత్రాలను అందజేస్తారని తెలియజేశారు. రైతుల గోడు ప్రభుత్వానికి తెలిసేలా నిరసన చేపట్టనున్నట్లు వివరించారు. ధాన్యం కొనుగోలు, రూ. 20 వేలు పెట్టుబడి సాయం తదితర సమస్యలపైన వైసీపీ ప్రభుత్వం పోరాడుతుందని మాజీ సీఎం జగన్ ఇటీవల అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.