హైదరాబాద్ వాసులకు అలర్ట్. హైదరాబాద్ లో న్యూ ఇయర్ సంబరాలకు ఎలాంటి విఘాతం కలగకుండా ఉండడానికి పోలీసులు చర్యలు తీసుకోనున్నారు. అర్ధరాత్రి 1 గంట వరకే ఈవెంట్స్ నిర్వహించాలని, సీసీ కెమెరాలు తప్పనిసరి ఉండాలని నిర్వాహకులకు సూచనలు చేశారు.
15 రోజుల ముందే ఖచ్చితంగా అనుమతులు తీసుకోవాలని వెల్లడించారు. వేడుకల్లో అశ్లీల నృత్యాల పైన నిషేధాన్ని విధించారు. ఒకవేళ తాగి వాహనం నడిపినట్లయితే రూ. 10వేల ఫైన్, ఆరు నెలల జైలు శిక్ష విధిస్తామని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ హెచ్చరించారు.
- హైదరాబాద్‌లో న్యూ ఇయిర్ వేడుకలపై ఆంక్షలు..
- న్యూ ఇయర్ ఈవెంట్ నిర్వాహకులకు పోలీసుల హెచ్చరిక.
- ఈవెంట్స్‌లో సీసీ కెమెరాలు తప్పనిసరి..
- వేడుకల్లో అశ్లీల నృత్యాలు నిషేధం..
- ఔట్‌డోర్‌లో రాత్రి 10 తర్వాత లౌడ్ స్పీకర్లు బ్యాన్.
- పబ్‌లు, బార్లలో మైనర్లకు అనుమతి నిరాకరణ.
- డ్రగ్స్ వినియోగిస్తే కఠిన చర్యలు-పోలీసులు.
- తాగి వాహనం నడిపితే రూ.10 వేలు జరిమానా, 6నెలలు జైలు.
- మైనర్లు వాహనం నడిపితే యజమానిపైనా కేసు.
- ర్యాష్ డ్రైవింగ్‌పై వెహికల్ యాక్ట్ కింద కేసు