వినాయక చవితి పర్వదినాన ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ తీవ్ర స్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. దీంతో ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ను మణిపాల్ ఆసుపత్రికి తరలించారు అధికారులు. నిన్న రాత్రి నుంచి ఆసుపత్రిలోనే ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ చికిత్స పొందుతున్నారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆరోగ్య పరిస్థితిపై తాడేపల్లి మణిపాల్ ఆస్పత్రి వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు.
‘కడుపునొప్పితో గవర్నర్ ఆస్పత్రిలో చేరారు. ప్రాథమిక వైద్య పరీక్షలు చేసి…అపెండిసైంటిస్ తో బాధపడుతున్నట్లు గుర్తించాం. రోబోటిక్ అపెండెక్టమీ సర్జరీ చేసాం. ఆపరేషన్ సక్సెస్ అయింది. గవర్నర్ ఆరోగ్యం నిలకడగా ఉంది’ అని ప్రకటించారు. ఇది ఇలా ఉండగా ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆరోగ్యం పై ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆరా తీశారు. గవర్నర్ ఆరోగ్యం ఎలా ఉంది ? ఆయనకు ఎలాంటి చికిత్సలు అందిస్తున్నారు ? ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆయనకు చికిత్స అందించాలని.. వాటిని దగ్గరుండి చూసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు సీఎం జగన్మోహన్ రెడ్డి.