AP government Shock to former minister Peddireddy’s life: పెద్దిరెడ్డికి మరో బిగ్ షాక్..సెక్యూరిటీ విషయంలో చుక్కెదురు అయింది. మాజీ మంత్రి పెద్దిరెడ్డికి ప్రాణహాని లేదని సెక్యూరిటీ రివ్యూ కమిటీ తేల్చినట్టు హైకోర్టుకు తెలిపింది ఏపీ ప్రభుత్వం. తనకు ఉన్న 5+5 గన్ మెన్లను కొనసాగించాలని హైకోర్టులో పిటిషన్ వేశారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి.
ఈ తరుణంలోనే… ఎమ్మెల్యేగా ఉన్న పెద్దిరెడ్డి 1+1 సెక్యూరిటీ కి మాత్రమే అర్హుడని చెప్పింది చంద్రబాబు ప్రభుత్వం. సెక్యూరిటీ రివ్యూ కమిటీ నిర్ణయంపై అభ్యంతరం ఉంటే సవాలు చేసుకోవచ్చని కోర్టు వెల్లడించింది. కౌంటర్ దాఖలు చేయాలని పిటిషనర్ ను ఆదేశిస్తూ తదుపరి విచారణ వచ్చే వారానికి వాయిదా వేసింది.