హత్యాయత్నం కేసు.. ఎఫ్బీఐ విచారణకు అంగీకరించిన ట్రంప్

-

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌పై ఇటీవల హత్యాహత్నం జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసును ఎఫ్‌బీఐ దర్యాప్తు చేస్తోంది. అన్ని కోణాల్లో దర్యాప్తు చేయాలని భావించిన ఈ సంస్థ ఇందులో భాగంగా డొనాల్డ్ ట్రంప్ను కూడా విచారించాలని నిర్ణయించింది. ఈ మేరకు విచారణకు ట్రంప్‌ అంగీకరించినట్లు ఎఫ్బీఐ తెలిపింది. సాధారణంగా నేర దర్యాప్తులో.. బాధితుల వాంగ్మూలం తీసుకునే ప్రక్రియలో భాగంగానే మాజీ అధ్యక్షుడిని ఇంటర్వ్యూ చేయనున్నట్లు అమెరికా వెల్లడించింది.

దాడి సమయంలో గమనించిన విషయాలు, ఆయన దృక్పథాన్ని తెలుసుకోవాలని అనుకుంటున్నామని ఎఫ్‌బీఐ ఉన్నతాధికారి కెవిన్‌ రోజెక్‌ తెలిపారు. నేర దర్యాప్తులో ఇతర బాధితులను విచారించినట్లుగానే మాజీ అధ్యక్షుడిని విచారిస్తామని పేర్కొన్నారు. ఇప్పటికే దాదాపు 450 మందిని విచారించామని వెల్లడించారు. అంతమందిని విచారించినా.. దుండగుడు ట్రంప్‌నే ఎందుకు లక్ష్యంగా చేసుకున్నారనే విషయంలో ఓ నిర్ధరణకు రాలేకపోయామని అన్నారు. అయితే, దాడి మాత్రం పక్కా పథకం ప్రకారమే జరిగిందని, అతడి ఇంట్లో, కారులో లభ్యమైన పేలుడు పదార్థాలు, అతడు వినియోగించిన డ్రోన్‌ను బట్టి తెలుస్తోందని ఎఫ్‌బీఐ అధికారి వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news