వయనాడ్​ బాధితులకు ఏపీ ప్రభుత్వం రూ.10 కోట్లు విరాళం

-

 కేరళలోని వయనాడ్ లో ప్రకృతి ప్రకోపించి వందల మంది ప్రాణాలు బలి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఇప్పటికే 300కు పైగా మంది మరణించగా.. వందకుపైగా మంది ఆచూకీ ఇంకా తెలిసి రాలేదు. కొండచరియలు విరిగిపడిన ఘటన నుంచి ఆ ప్రాంతం ఇంకా తేరుకోలేదు. అయితే ప్రకృతి విపత్తు నేపథ్యంలో మృతుల కుటుంబాలకు, బాధితులకు ఆ రాష్ట్రం పరిహారం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే కేరళకు అండగా కొందరు ప్రముఖులు నిలిచారు. భారీగా విరాళాలు ప్రకటించారు.

ఈ నేపథ్యంలోనే వయనాడ్ బాధితులను ఆదుకునేందుకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. ప్రకృతి విలయంతో అల్లాడుతోన్న వారి కోసం భారీ విరాళం ప్రకటించింది. 10 కోట్ల రూపాయల విరాళాన్ని ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. కేరళ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఈ పది కోట్ల రూపాయలను అందించనున్నారు. ఈ మేరకు రెవెన్యూ శాఖ ఆదేశాలు జారీ చేసింది. కేరళ వరద బాధితులు త్వరితగతిన కోలుకునేందుకు వీలుగా ఈ మొత్తాన్ని ప్రకటిస్తున్నట్లు చంద్రబాబు నాయుడు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version