ఏపీలో సాధారణ బదిలీల నుంచి తప్పించుకునేందుకు పక్కదారి పడుతోన్నారు పలువురు ఉద్యోగులు. బదిలీల నుంచి వెసులుబాటు కోసం వివిధ సంఘాల నుంచి ఆఫీస్ బేరర్ల లెటర్లు తీసుకుంటున్నారు పలువురు ఉద్యోగులు. ఆఫీస్ బేరర్లు కాకున్నా లేఖలు కొన్ని ఉద్యోగ సంఘాలకు లేఖలు ఇచ్చేస్తోన్నట్టు ప్రభుత్వం గుర్తించింది. దాంతో అనర్హులకు లేఖలు ఇవ్వడం.. ఫేక్ ఆఫీస్ బేరర్ల లెటర్ల పై ఏపీ సర్కార్ సీరియస్ అయ్యింది.
అందువల్ల ఇంకా మీదట ఆఫీస్ బేరర్ల లెటర్ల స్క్రూట్నీ కోసం మొత్తంగా ఏడు రకాల డాక్యుమెంట్లు ఇవ్వాలని అసోసియేషన్లకు మెమో జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. ఆయా అసోసియేషన్ల బైలాస్, ఓటర్ల లిస్టు, అసోసియేషన్ ఎన్నికల నోటిఫికేషన్ డాక్యుమెంట్లు, సర్వసభ్య సమావేశ తీర్మానాల కాపీలను సమర్పించాలని ప్రభుత్వం సూచించింది. డాక్యుమెంట్ల ఆధారంగా ఆఫీస్ బేరర్ల లెటర్లను స్క్రూట్ని చేయనుంది ప్రభుత్వం. ఇక నిదట తప్పుడు డాక్యుమెంట్లు ఇచ్చినా.. ఫేక్ లెటర్ల ఇచ్చినా చర్యలు ఉంటాయని అసోసియేషన్లకు ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది.