మాటలు మార్చటం చంద్రబాబుకి అలవాటు.. నష్టపరిహారం ఇవ్వకపోతే..?

-

అచ్యుతాపురం ప్రమాదాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకున్నట్టు లేదు అని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. అచ్యుతాపురం ఘటన బాధాకరం. ప్రమాదాలు జరిగిన సమయంలో కూడా నెపం మాపై నెట్టే ప్రయత్నం చేయటం దురదృష్టకరం. ప్రమాదానికి కారకులు ఎవరో గుర్తించి చర్యలు తీసుకోవాలి తప్ప నిందలు వేయటం సరికాదు. 2 గంటలకు ప్రమాదం జరిగితే 4 గంటలకు హోమ్ మంత్రి ప్రెస్ మీట్ పెట్టినా ప్రమాదం గురించి ప్రస్తావించలేదు.

కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రమాదం జరిగి ముగ్గురు మరణించారని పవన్ చెప్పారు. మరి ప్రభుత్వం అలెర్ట్ అవ్వాలి కదా అని ప్రశ్నించారు. సేఫ్టీ ఆడిట్ చేయాలని నేను కోరాను..అలా జరిగితే పరిశ్రమలు పెట్టే వారు వెనక్కి వెళ్తారని పవన్ చెప్పారు. అంటే ఇటీవల ప్రమాదం జరిగినప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత చర్చ జరిగిందని అర్దం అవుతుంది ప్రమాదం జరిగినా స్పందించక పోవటం వల్ల మళ్ళీ ఈ ప్రమాదం జరిగింది. అందుకే ఈ ప్రమాదానికి ప్రభుత్వం బాధ్యత వహించాలి. కోటి రూపాయలు నష్ట పరిహారం ఇవ్వటానికి చంద్రబాబు ఇబ్బంది పడ్డారు. నష్టపరిహారం కోటి ఇస్తేనే డెడ్ బాడీ లు తీసుకు వెళ్తామని బాధితులు ఆందోళన చేయటం ఇందుకు నిదర్శనం. చంద్రబాబు పై నమ్మకం లేకనే వారు ఇలా చేసి ఉంటారు. మాటలు మార్చటం చంద్రబాబుకి అలవాటు కాబట్టి మళ్ళీ నష్టపరిహారం ఇవ్వకపోతే ఇబ్బంది కాబట్టి బాధితులు ఆందోళన చేసి ఉంటారు అని అంబటి పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news