ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. కొత్త టూరిజం పాలసీని విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం…ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త టూరిజం పాలసీని విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం… వచ్చే ఐదేళ్లలో ఉపాధి కల్పన, ఆర్థిక వృద్ధి లక్ష్యంగా కొత్త పాలసీ తెచ్చినట్లుగా వెల్లడించింది.
పర్యాటక ప్రాజెక్టులకు సంబంధించి మౌలిక వసతులు కల్పించడమే పాలసీ ముఖ్య ఉద్దేశ్యంగా పేర్కొంది చంద్రబాబు నాయుడు సర్కార్. ఎకో, క్రూయిజ్, బ్యాక్ వాటర్ టూరిజంలతో పాటు పెట్టుబడులను ఆకర్షించేలా పాలసీ రూపొందించారు. ఇక కొత్త టూరిజం పాలసీతో ఏపీ సర్కార్ కు ఆదాయం పెరగనుంది.