ఉచిత సిలిండర్ల పథకానికి నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ..!

-

ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి సంబంధించిన సబ్సీడీ నిధులు విడుదల చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. లబ్దిదారులకు ఇవ్వాల్సిన ఒక సిలిండర్ల సబ్సీడీ మొత్తం రూ.895 కోట్లను విడుదలకు పాలనానుమతి వచ్చింది. దీపావళి పండుగను పురస్కరించుకుని అక్టోబరు 31 తేదీన ఒక ఉచిత సిలిండర్ ను లబ్దిదారులకు ప్రభుత్వం ఇవ్వనున్న సంగతి తెలిసిందే.

అయితే ఏడాదికి మూడు ఉచిత ఎల్పీజీ సిలిండర్ల ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లకు రూ.2684 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేసింది. గ్యాస్ కంపెనీలు, పౌరసరఫరాల శాఖ సంయుక్తంగా తెరచిన అకౌంటులో ఈ మొత్తం నిధుల జమ అవుతాయి. ఇక ఉచిత సిలిండర్లకు సంబంధించిన నిధులు డీబీటీ ద్వారా జమ చేయాలని నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. పబ్లిక్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ సిస్టం ద్వారా నగదు బదిలీతో లబ్దిదారు ఖాతాకు జమ అవుతాయని.. ఈమేరకు ఉత్తర్వులు జారీ చేసారు పౌరసరఫరాల శాఖ ఎక్స్ అఫీషియో కార్యదర్శి జి.వీరపాండియన్.

Read more RELATED
Recommended to you

Exit mobile version