ప్రకాశం బ్యారేజ్ నుండి శ్రీశైలంకు సీ ప్లేన్ : మంత్రి కందుల దుర్గేష్

-

అధికారులు ,ప్రజా ప్రతినిధులు కలసి పని చేయాలి. గుంటూరు జిల్లా అభివృద్ధి కోసం పని చేయాలి అని మంత్రి కందుల దుర్గేష్ సూచించారు. వ్యవసాయం, ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం, సబ్సిడీ పై ఆహార పదార్థాలు అందించడం వంటి అంశాలపై చార్చించాం. అమరావతి, గుంటూరు జిల్లాలని ఏక కాలంలో సాధిస్తాం. ఇక గుంటూరు ఛానల్ ఆధునికీకరణ కోసం ప్రభుత్వం నిధులు సేకరిస్తుంది అని మంత్రి అన్నారు.

ఇక స్వదేశీ దర్శన్ పథకం లో భాగంగా బీచ్ ల అభివృద్ధి చేయబోతున్నాం.నవంబర్ 9 నుండి సీ ప్లేన్ అందుబాటులో ఉంటుంది. ప్రకాశం బ్యారేజ్ నుండి శ్రీశైలంకు సీ ప్లేన్ పెట్ట బోతున్నాం అని తెలిపారు. సూర్య లంక, కాకినాడ, ఋషికొండ బీచ్ లు అభివృద్ధి చేయబోతున్నాం. ఇక ఋషికొండ రాజ భవంతిలో ప్రస్తుతం పర్యాటకులను అనుమతించడం లేదు.. కానీ భవిష్యత్ లో సామాన్య ప్రజలను ఆ భవంతిలోకి అనుమతించేలా ప్రయత్నాలు చేస్తున్నారు అని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version