హెల్మెట్‌ వినియోగాన్ని తప్పనిసరి చేయండి.. ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

-

హెల్మెట్ ధరించడంపై ఏపీ ప్రభుత్వానికి, పోలీసులకు హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. హెల్మెట్ ధరించకపోవడంతో  ప్రమాదాలు జరిగినప్పుడు వాహన దారులు ప్రాణాలను కోల్పోతుండటాన్ని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం తీవ్రంగా పరిగణించింది. ఈ క్రమంలోనే హెల్మెట్లు ధరించడం తప్పనిసరి చేయాలని ప్రభుత్వానికి, పోలీసులకు కీలక ఆదేశాలిచ్చింది.

“మోటారు వాహన చట్ట నిబంధనలు తప్పకుండా అమలయ్యేలా చూడాలి. నిబంధనలను ఏమేరకు అమలు చేస్తున్నారో వివరిస్తూ కౌంటర్‌ వేయాలి. వాహనాల తనిఖీ అధికారులు, ట్రాఫిక్‌ పోలీసులు బాడీ కెమెరాలను తప్పనిసరిగా ధరించాలి. చట్టాన్ని ఉల్లంఘించిన వారిని ఉపేక్షించవద్దు. తీవ్రంగా పరిగణించాలి. హెల్మెట్లు ధరించకపోవడం వల్ల కలిగే నష్టాలపై ఏపీ న్యాయసేవాధికార సంస్థ ప్రజలకు అవగాహన కల్పించాలి. ప్రభుత్వం కూడా.. మోటారు వాహనాల చట్ట నిబంధనలను తెలియజేస్తూ అత్యధిక సర్క్యులేషన్‌ ఉన్న ప్రాంతీయ, జాతీయ పత్రికల్లో ప్రకటనలు ఇవ్వాలి.” అని హైకోర్టు పేర్కొంది తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేస్తూ.. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకుర్, జస్టిస్‌ ఎన్‌.జయసూర్యతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసింది.

Read more RELATED
Recommended to you

Latest news