AP: ఈ జిల్లాలకు పిడుగులతో కూడిన భారీ వర్షాలు..!

-

AP Heavy rains with thunder for these districts: ఏపీలో రాబోయే మూడు రోజుల పాటు వర్షాలు పడనున్నాయి. తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్‌ ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. రేపు ఉత్తరాంధ్రలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు ఉన్నట్లు వెల్లడించింది.

AP Heavy rains with thunder for these districts

ముఖ్యమంగా రేపు అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. అలాగే అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు,నంద్యాల, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య , చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది.

Read more RELATED
Recommended to you

Latest news