దేశంలో పెట్టుబడుల పరిణామాలు తెలియజేయండి.. అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం

-

భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబరుస్తున్న విదేశీ విద్యాసంస్థలు, కార్పొరేట్, బిజినెస్‌ రంగాల్లో పరిణామాలన్నింటినీ తన దృష్టికి తీసుకురావాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. దేశంలో పెట్టుబడులకు సంబంధించిన పరిణామాలు, వేల కోట్ల రూపాయల టర్నోవర్‌ కలిగిన కంపెనీల విస్తరణ సమాచారమంతా ఎప్పటికప్పుడు తనకు చేరేలా చూడాలని తెలిపారు. ముంబయి, దిల్లీ కేంద్రంగా వెలువడే ఆర్థిక, వ్యాపార, పెట్టుబడుల వ్యవహారాల వార్తలను రిపోర్ట్‌ చేసే జాతీయస్థాయి వార్తా పత్రికలను రోజూ ఉదయం తన డ్యాష్‌బోర్డులో పెట్టాలని అధికారులకు సూచించారు.

వ్యాపార, పారిశ్రామిక రంగాల్లోని పరిణామాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడం ద్వారా… పెట్టుబడులు ఆకర్షించేందుకు రాష్ట్రానికి ఉన్న అవకాశాలు అందిపుచ్చుకోవచ్చని చంద్రబాబు భావిస్తున్నారు. పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్‌ అనువైన కేంద్రమనే ముద్రను కార్పొరేట్‌ రంగంలో వేసి, తద్వారా పెద్ద ఎత్తున పెట్టుబడులు సాధించొచ్చని సీఎం అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన ప్రణాళికలు తయారు చేయడంలో చంద్రబాబు బిజీబిజీగా గడుపుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news