ప్రభుత్వ కార్యాలయాలు, పంచాయతీ భవనాలకు రంగులు వేయడం అనే వ్యవహారం ఏపీలో ఇప్పట్లో తేలేలా లేదు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలో గ్రామ పంచాయతీలకు, గ్రామ సచివాలయాలకు, ప్రభుత్వ కార్యాలయాలకు.. వైకాపా రంగులు వేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం కాస్త హైకోర్టుకి వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై గతంలోనే హైకోర్టు… స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించే ముందు… ప్రభుత్వ కార్యాలయాలకు వైకాపా రంగులు తీసేయాలని ఆదేశించింది! ఈ క్రమంలో ప్రభుత్వ కార్యాలయాలకు నాలుగు రంగులు వేయాలని రాష్ట్ర ప్రభుత్వం 623 జీవో విడుదల చేసింది.
ఆ జీవో ప్రకారం వైకాపా పార్టీ జెండాలో మూడు రంగులు మాత్రమే ఉండటం వల్ల అవే కనిపిస్తున్నాయి కాబట్టి… నాలుగు రంగులు వేయాలని ఆ జీవో జారీ చేసింది. అందులో భాగంగా.. పైన వైకాపా రంగులు ఉంటూనే కింద మట్టి రంగు కొత్తగా యాడ్ అయ్యింది. అవును… ప్రభుత్వ కార్యాలయాలకు వైకాపా రంగులు తొలగించాలనే హైకోర్టు ఆదేశాల అనంతరం మట్టి రంగు చేరుస్తూ ప్రభుత్వం మరో జీవో జారీ చేసింది. అయితే ఈ జీవోను కూడా నిలిపివేస్తూ ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో పిటిషన్లపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం ఈమేరకు ఆదేశాలు జారీ చేస్తూ.. కేసు విచారణను ఈనెల 19కి వాయిదా వేసింది.
కాగా… రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలు, పంచాయతీ భవనాలకు వైకాపా పార్టీ రంగులు వేయడంపై పలువురు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే! దీనిపై స్పందించిన రాష్టర్ ఉన్నత న్యాయస్థానం… ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులు వేయడం సరికాదని, వెంటనే తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో నాటి నుంచి ఆంధ్రప్రదేశ్ లో ఈ రంగుల వివాదం కొనసాగుతూనే ఉంది!