ఎంపీ మిథున్‌రెడ్డికి హైకోర్టులో స్వల్ప ఊరట!

-

ఏపీలో గత వైస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో లిక్కర్ స్కాం జరిగిందని కూటమి నేతల ఫిర్యాదుతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఇందుకోసం నియమించిన సిట్ పది నెలలుగా ఈ కేసులో దర్యాప్తు కొనసాగిస్తోంది. ఈ కేసులో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, ఎంపీ మిథున్ రెడ్డికి తాజాగా సిట్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 19వ తేదీన విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది.

ఈ క్రమంలో మిథున్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. సిట్ విచారణ సమయంలో న్యాయవాదిని అనుమతించాలని కోరుతూ కోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై ఇవాళ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలో స్టేట్మెంట్ ఆడియో, వీడియో రికార్డు చేయాలని అధికారులను ఆదేశించాలని ఎంపీ మిథున్ రెడ్డి లాయర్ కోర్టును కోరారు. దీనిపై స్పందించిన హైకోర్టు లిక్కర్ స్కాంలో సిట్ విచారణకు న్యాయవాదిని అనుమతిస్తూ.. విచారణ సమయంలో స్టేట్‌మెంట్ రికార్డు చేయటంలో జోక్యం చేసుకోవద్దని ఆదేశించింది. మరోవైపు స్టేట్‌మెంట్ ఆడియో, వీడియో రికార్డు చేయాలని ఎంపీ మిథున్ రెడ్డి లాయర్ కోరగా.. విజిబుల్ సీసీ కెమెరాలు ఉన్న చోట విచారణ జరపాలని సిట్ కు ఆదేశాలు జారీ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news