తెలంగాణకు మారుబెనీ.. రూ. 1,000 కోట్ల ఒప్పందం

-

ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి బృందం జపాన్ లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. తొలి రోజు పర్యటనలోనే ప్రభుత్వంతో కీలకమైన పెట్టుబడుల ఒప్పందం కుదిరింది. జపాన్ కు చెందిన వ్యాపార దిగ్గజం మారుబెనీ కంపెనీ తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో నెక్స్ట్స్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్క్స్ ను  ఏర్పాటు చేసేందుకు మారుబేని కంపెనీ సుముఖుత వ్యక్తం చేసింది.

టోక్యోలో మారుబెనీ కంపెనీ ప్రతినిధులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. దాదాపు రూ. 1,000 కోట్ల ప్రారంభ పెట్టుబడితో రాష్ట్రంలో ప్రాజెక్టును చేపట్టనున్నట్లు మారుబెనీ కంపెనీ ప్రభుత్వానికి తెలిపింది. దశల వారీగా ఫ్యూచర్ సిటీలో 600 ఎకరాల్లో ప్రపంచ స్థాయి, నెక్స్ట్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్క్ ను అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించింది. ఈ డీల్ కు సంబంధించి లెటర్ ఆఫ్ ఇంటెంట్ పై ముఖ్యమంత్రి సమక్షంలో ప్రభుత్వ అధికారులు, కంపెనీ ప్రతినిధులు సంతకాలు చేశారు. ఈ పెట్టుబడితో రాష్ట్రంలో దాదాపు 30,000 మందికి ఉద్యోగ అవకాశాలు దక్కుతాయని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Latest news